- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సినిమా తరహాలో స్మగ్లింగ్.. భారీగా పట్టుబడిన గంజాయి
దిశ, హనుమకొండ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఒక గంజాయి స్మగ్లర్లను హాసన్ పర్తి, తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుంచి పోలీసులు సుమారు రూ.85 లక్షల విలువ గల 338 కిలోల గంజాయి తో పాటు గంజాయిని తరలిస్తున్న ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్ కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలను వెల్లడించారు. పోలీస్ అధికారుల ఆదేశాల మేరకు హాసన్ పర్తి ఎస్ఐ దేవేందర్ రెడ్డి, హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంతరం సాగర్ క్రాస్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
అనుమానస్పదంగా వస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు తనిఖీ చేయగా ట్రాలీ అడుగు భాగంలో రహస్యంగా ఏర్పాటు చేసిన డబ్బా లో గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నిందితుడికి గంజాయి తీసుకు రమ్మని చెప్పిన వ్యక్తితో పాటు గంజాయిని అందజేసిన వ్యక్తులు ఇరువురు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. గంజాయిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్ , తెలంగాణ యాంటీ డ్రగ్స్ వరంగల్ విభాగం ఇన్స్ స్పెక్టర్ సురేష్ , హసన్ పర్తి ఇన్స్పెక్టర్ చేరాలు, ఎస్ఐ దేవేందర్ , రవితో పాటు ఇతర పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఏసీపీలు దేవేందర్ రెడ్డి, నంది రాం నాయక్ పాల్గొన్నారు.