- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితుల అరెస్ట్
దిశ, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం లో టాస్క్ ఫోర్స్, దమ్మపేట పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఓ వాహనంలో భారీగా గంజాయి పట్టుబడింది. దీనికి సంబంధించిన వివరాలు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ దమ్మపేట పోలీస్ స్టేషన్ లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం స్టేజి వద్ద జిల్లా టాస్క్ ఫోర్స్, దమ్మపేట పోలీసులు సంయుక్తంగా సోమవారం వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఈ క్రమంలో అశ్వారావుపేట వైపు నుండి కెమికల్ లోడుతో వస్తున్న అశోక్ లేలాండ్ డీసీఎం వాహనాన్ని తనిఖీ చేయగా కెమికల్ బస్తాల మధ్యలో అమర్చుకొని 508 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు 1.77కోట్లు ఉంటుందని, ఒరిస్సా రాష్ట్రంలోని కొర్రాపూర్ జిల్లా నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీదుగా మహారాష్ట్ర తరలిస్తుండగా నిషేధిత గంజాయితో పాటు ముఠా పోలీసులకు పట్టుబడ్డారని, మహారాష్ట్ర వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కలిగిన డీసీఎం వాహనం కెమికల్ లోడ్ మధ్యలో గంజాయిని పెట్టుకొని మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాతో పాటు ముంబై, పూణే తదితర ప్రాంతాలకు ఈ ముఠా గంజాయిని సరఫరా చేస్తోందని ఎస్పీ వివరించారు.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గంజాయి రవాణా పై ఉక్కు పాదం మోపామని, అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం స్టేజి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి రవాణా పట్టుబడినట్లు తెలిపారు. దీంతో గంజాయ్ రవాణా చేస్తున్న వాహనాన్ని సీజ్ చేసి దమ్మపేట పోలీస్ స్టేషన్ కు తరలించి గంజాయి ముఠా తరలిస్తున్న నాసిక్ పూణే ప్రాంతాలకు చెందిన ఆరుగురు వ్యక్తుల నుండి వ్యక్తుల నుంచి పూర్తి వివరాలు సేకరించి వారిని అరెస్టు చేసినట్లు, ఈ ముఠాలో పాత్రధారులైన మరో ఆరుగురిని కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
గంజాయి సేవించే వారిపై ప్రత్యేక దృష్టి..
జిల్లావ్యాప్తంగా గంజాయి సేవించే వారిపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు ఎస్పీ రోహిత్ రాత్ తెలిపారు. ఇప్పటికే పలు కళాశాలలో, గ్రామాల్లో మండల కేంద్రాల్లో గంజాయి సేవించ కుండా ఉండేందుకు ప్రజలకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి గంజాయి టెస్టింగ్ కిట్స్ అందుబాటులోకి వచ్చాయని, అంతేకాకుండా గంజాయి పట్టుకోవడానికి ప్రత్యేక డాగ్ స్క్వాడ్ ద్వారా కూడా ఇప్పటికే పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి వినియోగిస్తున్న సేవిస్తున్న వారి సమాచారాన్ని పోలీసులకు ప్రజలు అందించినట్లయితే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, టాస్క్ ఫోర్స్ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రవీణ్,దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు.