- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి: మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతిచెందారు. ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బుధవారం తెల్లవారు జామున 4గంటల సమయంలో ఆలం అనే టైలరింగ్ షాపులో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే షాపు పైన ఉన్న ఇండ్లకు మంటలు వ్యాపించడంతో అప్పటికే ఏడుగురు మరణించారు. వీరంతా దట్టమైన పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనను శంభాజీ నగర్ పోలీస్ కమిషనర్ మనోజ్ లోహియా ధ్రువీకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.