- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టార్గెట్ ఒంటరి మహిళలు.. ఇప్పటివరకు ఐదుగురిని హత్యచేసిన రామస్వామి
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లాలో జరిగిన మహిళ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు బాబు అలియాస్ రామస్వామిని పోలీసులు సీరియల్ కిల్లర్‌గా గుర్తించారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ.. సహజీవనం చేసి.. ఆ తర్వాత హతమారుస్తున్నట్లు నిర్ధారించారు. నిందితుడి నేర చరిత్రపై ఆరా తీయగా.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. కాగా, ఇటీవల వికారాబాద్ జిల్లా పుల్‌మద్ది గ్రామం శివారు పరిధిలో చేవెళ్లకు చెందిన అనసూయ అనే మహిళను రామస్వామి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మెడకు కొంగు బిగించి, పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికుల సమచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేసిన పోలీసులు అసలు వివరాలు వెలికి తీస్తున్నారు. కాగా, అనసూయను హత్య చేసిన అనంతరం కాళ్ల కడియాలు, చెవి దిద్దులను రామస్వామి ఎత్తుకెళ్లడం గమనార్హం.