మహిళలంటే ఆర్టీసీ డ్రైవర్లకు చులకన..

by Sumithra |
మహిళలంటే ఆర్టీసీ డ్రైవర్లకు చులకన..
X

దిశ, బిజినేపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం అనే పథకాన్ని 100% పూర్తి చేస్తున్న ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్లకు మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆర్టీసీ బస్సు ఎక్కేందుకు వెళ్ళిన మహిళకు గాయాలైన సంఘటన మండల పరిధిలోని కోటాల్ గడ్డ బస్టాండ్ లో శుక్రవారం చోటు చేసుకుంది. మంతటి గ్రామానికి చెందిన లక్ష్మమ్మ తన పనుల నిమిత్తం కోటాల్ గడ్డకు బంధువుల ఇంటికి చేరుకొని మళ్లీ కోటాల్ గడ్డ బస్టాండ్ లో పాలెం వెళ్లేందుకు బస్టాండ్ లో వేచిచూస్తుంది.

సరిగ్గా అదే సమయానికి నాగర్ కర్నూల్ నుంచి మహబూబ్నగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు బస్టాప్ లో ఆగింది. డ్రైవర్ అసమ్మతితో ఉండడంతో ఆర్టీసీ బస్సు ఆపి మళ్లీ మూవ్ చేయడంతో లక్ష్మమ్మ మెట్లు పై ఎక్కి కింద పడిపోయింది. బస్సు ముందుకెళ్లడంతో కాలుకు ఫ్రాక్షరై రక్తస్రావం కారడంతో వెంటనే స్థానికులు 108 కి సమాచారం అందించి ఆమెను పాలెం గవర్నమెంట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 108 ఈఎంటీ లలిత, పైలెట్ జాంగిర్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి రెఫర్ చేశామని అక్కడి వైద్యులు తెలిపారు. ఆర్టీసీ బస్సులో వెళ్లండి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరండి అనే ఒక నీతి వాక్యమే తప్ప ఆదరణలో శూన్యం అని ఆర్టీసీ డ్రైవర్ చూస్తే అర్థమవుతుందని చెప్పవచ్చంటున్నారు ప్రయాణికులు.

Advertisement

Next Story