- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News:రూ.27 లక్షల అక్రమ మద్యం ధ్వంసం..
దిశ ప్రతినిధి,చిత్తూరు:జిల్లా పరిధిలో 116 కేసులకు సంబంధించి అక్రమ రవాణా విషయంలో పట్టుబడిన రూ.27 లక్షల విలువచేసే మద్యాన్ని చిత్తూరు సబ్ డివిజన్ పోలీసులు ధ్వంసం చేశారు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మీడియాకు వెల్లడించారు. చిత్తూరు వెస్ట్ సర్కిల్ పరిధిలోని యాదమరి పరిధిలో 40 కేసులు, తవణంపల్లె పరిధిలో 8 కేసులు గుడిపాల పరిధిలో 68 కేసులు మొత్తం 116 కేసులలో పట్టుబడి సీజ్ చేసిన అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు.
చిత్తూరు పోలీసు సబ్ డివిజన్ పరిధిలోని చిత్తూరు వెస్ట్ సర్కిల్‌కు చెందిన యాదమరి, తవనంపల్లె గుడిపాల పోలీస్ స్టేషన్‌లలో నమోదైన 116 కేసులలో పట్టుబడి సీజ్ చేసిన 27 లక్షల విలువ గల 3240 లీటర్ల అక్రమ మద్యం 1258 లీటర్ల నాటు సారాను యాదమరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పెరుమాళ్ళపల్లి గ్రామం నందు గల ఖాళీ ప్రదేశంలో రోడ్ రోలర్ తో ఈరోజు ఉదయం అధికారుల సమక్షంలో ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో చిత్తూరు డి.ఎస్పీ రాజగోపాల్ రెడ్డి చిత్తూరు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ రెడ్డి ఎస్ఈబీ ఏఈఎస్ రవి, యాదమరి ఎస్.ఐ రామాంజనేయులు, తవణంపల్లి ఎస్.ఐ. అనిల్ కుమార్, గుడిపాల ఎస్.ఐ. నరేంద్ర కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.