స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..

by Sridhar Babu |
స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం..
X

దిశ, సికింద్రాబాద్ : స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న హబ్సిగూడలోని ఓ మసాజ్ సెంటర్ పై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సెంటర్లో ఉన్న నలుగురు యువతులను, ఒక విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న స్పా సెంటర్ నిర్వాహకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఓయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓయూ పోలీసు స్టేషన్ పరిధిలోని హబ్సిగూడ వీధి నంబరు 8లో మల్లేష్ అనే వ్యక్తి రాయల్ స్పా సెంటర్ పేరుతో ఓ మసాజ్ సెంటర్ను నిర్వహిస్తున్నాడు. ఈ సెంటర్లో

అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్​ పోలీసులు గురువారం సెంటర్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. పోలీసుల దాడిలో నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. యువతులను తార్నాకలోని మహిళా స్టేట్ హోమ్​కు తరలించగా విటుడిని ఓయూ పోలీసులకు అప్పగించారు. ఓయూ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాయల్ స్పా సెంటర్ నిర్వాహకుడు మల్లేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్పా సెంటర్ నిర్వాహకుడు చిక్కితే కానీ సెంటర్లో జరుగుతున్న పూర్తి స్థాయి కార్యకలాపాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

Advertisement

Next Story