- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు..
దిశ,మహేశ్వరం : పశువుల పాకలో పేకాట ఆడుతున్న వారిని కందుకూరు పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 9 సెల్ ఫోన్లు ,73,490 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దమ్మ తండాలో గూదే మల్లయ్యకు చెందిన పశువుల కొట్టంలో(పాక) శనివారం అర్ధరాత్రి పేకాట ఆడుతున్నరని కందుకూరు పోలీసులకు సమాచారం వచ్చింది. ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి పేకాట ఆడే స్థలానికి చేరుకున్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన పోల్కం శ్రీశైలం,పుట్లగారి దశరథ, పోల్కం రమేష్, ఆకుల మోహన్, పోల్కం మల్లేష్, జేల్ల రమేష్, వంగూరి శ్రీను, ధన్నారం గ్రామానికి చెందిన ఆంబోజ్ శ్రీనివాస్, ఈసరి శ్రీనివాస్ పేకాట ఆడుతున్నారు.వీరి నుంచి పోలీసులు 9 సెల్ ఫోన్లు 73,490 నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.