- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తోటపల్లి చెరువులో వ్యక్తి గల్లంతు.. 24 గంటలు గడిచిన లభించని ఆచూకీ
దిశ, మానకొండూరు, బెజ్జంకి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వల్ల ఏడతెరిపి లేకుండా మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా భారీగా వరద ఉప్పొంగడంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన సందరి లక్ష్మణ్ (50) తోటపల్లి గ్రామ చెరువులో చేపలు పట్టడానికి ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి వరదలో గల్లంతయ్యాడు. ఈ సమాచారాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు. కాగా ఈ సమాచారం పోలీసులకు లేటుగా అందడంతో హుటాహుటిన వెళ్లి చూడగా సంఘటన స్థలంలో తను వేసుకొచ్చిన సైకిల్ ఆనవాల్లు ఉండగా బాధితుడు వరదలో కొట్టుకుపోయాడనే అనుమానంతో ఆదివారం రాత్రి వరకు వెతికారు.
అయితే చీకటి కావడంతో అతని ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం సిద్ధిపేట జిల్లా సీఐ శ్రీనివాస్, బెజ్జంకి మండల తహసీల్దార్, స్థానిక ఎస్సై కృష్ణారెడ్డి, రెస్క్యూ టీమ్ సంఘటన స్థలానికి చేరుకొని ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎలాగైనా సరే గల్లంతైన వ్యక్తి నీ గుర్తించడానికి గజ ఈతగాళ్లతో పాటు గ్రామంలోని ఈతగాళ్లను కూడా తాడు సహాయంతో రంగంలోకి దింపుతున్నారు. ఈ గాలింపు చర్యల్లో భాగంగా బెజ్జంకి మండల తహసీల్దార్ ఉట్కూరి శ్రీనివాస్ రెడ్డి, సిద్ధిపేట సీఐ శ్రీనివాస్,బెజ్జంకి ఎస్సై కృష్ణ రెడ్డి, ఎంపిడిఓ కె ప్రవీణ్, రెవెన్యూ డిపార్ట్మెంట్, తాజా మజా సర్పంచ్ బోయినపల్లి నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది, కుటుంబికులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో ఉన్నారు.