- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..ఒకరి అరెస్ట్
దిశ,కడప:అన్నమయ్య జిల్లా సాని పాయ అటవీ ప్రాంతంలో 18 ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకుని ఒక తమిళ స్మగ్లర్లు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ చెంచు బాబు నేతృత్వంలో ఆర్ఎస్ఐ వై విశ్వనాథ్ గురువారం సాని పాయ బేస్ క్యాంప్ నుంచి కూంబింగ్ కు వెళ్లారు. వీరు గుర్రపు బాట వైపు ఉన్న వీరబల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు.
రాజంపేట వీరబల్లి ఫారెస్టు బీటు పరిధిలో మాది రెడ్డి గారి పల్లి సమీపంలో కొంతమంది వ్యక్తులు దుంగలను మోసుకుని వెళుతూ కనిపించారు. వీరిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, టాస్క్ ఫోర్స్ పోలీసులను గమనించి దుంగలను పడేసి చెట్ల పొదల మధ్య పారిపోయారు. అయితే ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. అతనిని తమిళనాడు, తిరువన్నామలై జిల్లా జమునామత్తూరు తాలూకాకు చెందిన దొరైస్వామి గా గుర్తించారు. ఆ ప్రాంతంలో పడిఉన్న 18 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు. పట్టుబడిన వ్యక్తితో పాటు దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సీఐ జీ. శ్రీనివాసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.