రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ మండలంలోని తాడ్కోల్ గ్రామంలో తుఫాన్ వాహనం ఢీకొని పోతురాజు గంగవ్వ (65) అనే వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెం దిన పోతురాజు గంగవ్వ బాన్సువాడ మండలం తాడ్కోల్ గ్రామానికి శుభకార్యం కోసం రాగా అక్కడి బస్టాండ్ సమీపంలో బస్సుదిగి రోడ్డు దాటి వెళ్తుండగా అతివేగంతో వచ్చిన తుఫాన్ వాహనం ఢీ కొట్టడంతో గంగవ్వ అక్కడికక్కడే మరణించినట్లు సీఐ వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Next Story