కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్‌

by Sridhar Babu |
కొండగొర్రె మాంసం విక్రేతల అరెస్ట్‌
X

దిశ,గంభీరావుపేట : వేటగాళ్లు అమర్చిన ఉచ్చులో బలైన కొండ గొర్రె మాంసాన్ని విక్రయిస్తున్న ఇద్దరిని ఫారెస్ట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో కొండగొర్రె మాంసాన్ని విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో ఫారెస్ట్‌

అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారి ఇంటి పరిసరాల ప్రాంతాల్లో కొండ గొర్రె తల, కాళ్లు, మాంసం కనిపించింది, దాంతో అటవీశాఖ సిబ్బంది విచారించి, ఆ మాంసాన్ని సిరిసిల్ల కార్యాలయానికి తరలించారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కల్పన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అంజలి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్​, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed