ముగ్గురు ఆడపిల్లలతో కలిసి తల్లి మిస్సింగ్

by Bhoopathi Nagaiah |
ముగ్గురు ఆడపిల్లలతో కలిసి తల్లి మిస్సింగ్
X

దిశ, జూబ్లిహిల్స్ : తన ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం అయిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాహమత్ నగర్, కార్మిక నగర్‌కు చెందిన ప్రీథిరాజ్, జ్యోతి (36) భార్యభర్తలు. వీరికి మౌనిక (11), నందిని (10), యశాస్విని (6) అనే ముగ్గురు ఆడ పిల్లలున్నారు. ప్రీథిరాజ్ సనత్ నగర్‌లో సెక్యూరిటీ జాబ్ చేస్తుంటాడు. ప్రీథిరాజ్, జ్యోతి మధ్య కుటుంబ కలహాలున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీన యధావిధిగా ఉద్యోగానికి వెళ్ళిన ప్రీతి రాజ్ సాయంత్రం 3:30 గంటల సమయంలో ఇంటికి చేరుకోగా ఇంటి తలుపులు తాళం వేసి ఉన్నాయి. తన భార్య జ్యోతితో సహా మౌనిక, నందిని, యశాస్విని ముగ్గురు పిల్లలు కనిపించలేదు. జ్యోతికి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వచ్చింది. నలుగురి ఆచూకీ కోసం చుట్టూ పక్కల, బంధువుల వద్ద వాకాబు చేసినా ఎలాంటి సమాచారం లభించలేదు. దీంతో ఖంగారు పడిన ప్రీథిరాజ్ గురువారం మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story