సంగారెడ్డిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

by Shiva |
సంగారెడ్డిలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు
X

దిశ, కంది : సంగారెడ్డి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. శాంతినగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి పట్టణంలోని భూమయ్య పెట్రోల్ బంక్ వద్ద యూటర్న్ తీసుకుంటున్నారు. అదే సమయంలో సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి తన కారుతో చౌరస్తా వైపు వెళ్తుండగా వేగంగా వచ్చి యూటర్న్ తీసుకుంటున్న కారును ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story