- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆర్ఎంపీ వైద్యం వికటించి వివాహిత మృతి
దిశ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని తాడికల్ గ్రామానికి చెందిన మహిళ, ఆర్ఎంపీ వైద్యుడి వైద్యం వికటించి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తాడికల్ గ్రామానికి చెందిన సాయిల్లా స్వప్న (32) అనే మహిళకు జ్వరం రాగ రక్త, మూత్ర పరీక్షలను చేయించి మంగళ, బుధ, గురువారం వరుసగా మూడు రోజులు ఆర్ ఎం పీ సైలెన్స్, పెట్టి ఇంజక్షన్లు వేశాడని దీంతో చలికి గజగజ వణికి పోవడం తో మరో రెండు ఇంజక్షన్లను నడుముకు వేశారన్నారు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లేసరికి పరిస్థితిని పసిగట్టిన ఆర్ఎంపీ మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించాలని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి చేయి దాటిపోయిందని గ్రహించిన ప్రైవేటు ఆసుపత్రి వారు ప్రభుత్వాసుపత్రికి తరలించాలని తెలపడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పది నిమిషాల వ్యవధిలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.మృతురాలికి భర్త ,ఇద్దరు కుమారులు ఉన్నారు .తన కూతురు మరణానికి ఆర్ఎంపీ అందించిన వైద్యమే కారణమని పేర్కొంటూ మృతురాలి తండ్రి కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.