విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

by Sridhar Babu |
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
X

దిశ, గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చడ్మల్ తండాకి చెందిన మాలోత్ గోపాల్( 30) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. బుధవారం సాయంత్రం బీర్మల్ తండాకు అతని బావ దగ్గరికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ చద్మల్ తండా గ్రామానికి వస్తుండగా రాత్రి

సమయంలో అనుకోకుండా రోడ్డు నుంచి లోపలికి పొలాల వైపు వెళ్లగా దౌలత్ రామ్ వ్యవసాయ పొలంలో కరెంట్ వైరు వర్షానికి కిందపడింది. ఆ వైరుకు విద్యుత్​ ప్రసరించి కరెంట్ షాక్ తగిలి గోపాల్ చనిపోయాడు. మృతుని భార్య మాలోత్ షాను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతునికి ఇద్దరు కుమారులు ఉన్నారు.


Next Story

Most Viewed