Man die : కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

by Sridhar Babu |
Man die : కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
X

దిశ,దౌల్తాబాద్ : మండలంలోని బిచ్చల్ గ్రామానికి చెందిన అంజిలప్ప(47) అనే వ్యక్తి శుక్రవారం కరెంట్ షాక్ తో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం అంజిలప్ప వ్యవసాయంతో పాటు గ్రామంలో మైనర్ కరెంట్ రిపేర్లు చేస్తుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సొంత గ్రామానికి చెందిన కిష్టయ్య ఇంట్లో కరెంట్ సమస్య ఉండటంతో ఇంట్లో కరెంట్ సరఫరా

కోసం విద్యుత్ స్తంభం ఎక్కినా అంజిలప్పకు ఒక్కసారిగా కరెంట్ రావడంతో విద్యుత్ షాక్ కు గురై స్తంభం పై నుంచి కిందపడ్డాడు. తలకు బాగా గాయం కావడంతో చావుబతుకులో ఉన్న అంజిలప్ప ను స్థానికులు చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపొయినట్టు తెలిపారు. మృతుని భార్య తెలుగు అంజిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు దౌల్తాబాద్ ఎస్సై రవి గౌడ్ తెలిపారు.

Advertisement

Next Story