- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి.. కన్నీరుమున్నీరవుతోన్న గ్రామస్థులు
దిశ, చింతపల్లి: చింతపల్లి మండలం కృష్ణరాయనిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఒక యువకుడు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమీపంలో ఉన్న మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. శనివారం పండుగ ఉత్సాహంలో ఉన్న ఆ యువకుడు గణేష్ మండపంలో లైట్ బిగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కృష్ణరాయనపల్లి గ్రామానికి చెందిన కారింగ్ రామచంద్రం -లక్ష్మమ్మ పెద్ద కుమారుడు కారింగ్ వర్ధన్ గౌడ్ (21). ఇతడు హైదరాబాద్‌లో బిటేక్ చదువుతున్నాడు. తమ కండ్ల ముందే వర్ధన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వర్ధన్ మృతి కుటుంబంలో తీరని విషాదం నింపింది.