arrest : ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
arrest : ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : జిల్లాలోని దేవాలయాలలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి, నిందితుని వద్ద 1000 రూపాయలు, దొంగతనాలకు ఉపయోగించిన రాడ్డును స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీఐ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ కరీంనగర్ రూరల్ మండలం దుర్షెడ్ గ్రామానికి చెందిన బుద్ధుల యుగేందర్ అనే వ్యక్తి మద్యానికి, జల్సాలకు అలవాటు పడి, సంపాదన జల్సాలకు సరిపడక దొంగతనాలకు అలవాటు పడినట్లు తెలిపారు. గతంలోనే యుగేందర్ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చి, ఈనెల 26న రాత్రి మండలంలోని

పలు గ్రామాలలో సాయిబాబా, ఎల్లమ్మ, పెద్దమ్మ ఆలయాలలో దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. ఎల్లారెడ్డిపేట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సీఐ, ఎస్ఐ తమ సిబ్బందితో ప్రత్యేక బృందంగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా మంగళవారం నిందితుడు దొంగతనానికి వస్తున్నాడన్న సమాచారం మేరకు ఎల్లారెడ్డిపేట్ బస్టాండ్ లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుని వద్ద 1000 రూపాయలు, దొంగతనాలకు ఉపయోగించిన ఐరన్ రాడ్ స్వాధీనం చేసుకోని రిమాండ్ కి తరలించడం జరిగిందన్నారు. కరీంనగర్ జిల్లాలో బద్ధుల యుగేందర్ పై గతంలో 17 కిపైగా కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసు త్వరగతిన ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సీఐ శ్రీనివాస్, ఎస్ఐ రమాకాంత్, క్లూస్ టీం ఏఎస్ఐ శరత్, సిబ్బంది బాబయ్య, రాజేందర్, శ్రీనాథ్ లను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed