- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
crime : ప్రాణాల మీదకు తెచ్చిన రుణమాఫీ
దిశ, మధిర : ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఓ మహిళ ప్రాణాలమీదకు తెచ్చింది. మాఫీ డబ్బుల్లో వాటా ఇవ్వాలని పెద్దమ్మపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన ఉదంతం ఇది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్ గా గుర్రం అరుణ కుమారి విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు భర్త వెంకట్రావు ద్విచక్ర వాహనంపై అంగన్వాడీ కేంద్రానికి చేరుకుంది. గుర్రం ప్రకాష్ రావు కు గుర్రం వెంకటరావు, రాంబాబు లు ఇద్దరు కుమారులు. కొన్ని సంవత్సరాల క్రితం రాంబాబు మరణించాడు. రాంబాబుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు దెందుకూరు గ్రామంలోని శ్రీరామ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.
రాంబాబు కుమారుడు సాయికుమార్ బుధవారం పెదనాన్న , పెద్దమ్మ ద్విచక్ర వాహనంపై అంగన్వాడీ కేంద్రానికి వెళ్లేది గమనించి కొద్దిసేపటి తర్వాత అంగన్వాడీ కేంద్రాన్ని చేరుకొని పెద్దమ్మ తో మీ ఆయన ఎక్కడ నాకు తాతయ్య రుణమాఫీ తాలూకా వాటా వస్తుందని అడిగాడు. తాతకున్న ఆస్తిలో సగం వాటా ఇవ్వాలని, లేకపోతే నీ భర్తను చంపుతానంటూ పెట్రోల్ బాల్ చూపిస్తూ వాగ్వివాదానికి దిగాడు. నన్ను ఇక్కడ దిగబెట్టి మీ పెదనాన్న పొలానికి వెళ్లాడని, అక్కడికి వెళ్లి మాట్లాడుకోండి అని అరుణ్ కుమారి సమాధానం చెప్పింది. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో సాయి నా పెళ్లి సంబంధాన్ని మీరే చెడగొట్టారని ఉక్రోషంతో ఊగిపోతూ తాను ముందుగా తెచ్చుకున్న పెట్రోల్ బాల్ ను వేసి వెంటనే నిప్పు అంటించ్చాడు.
అరుణ కుమారి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు తమ ఇళ్ల వద్ద నుండి దుప్పట్లు తీసుకొచ్చి ఆమెపై కప్పి మంటలు చల్లార్చారు. అనంతరం 108కు సమాచారం అందించడంతో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మోదుగు వెంకటేశ్వర్లు, శ్రీనివాసు ఆమెకు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీ కేంద్రంలో కొద్దిమంది పిల్లలు ఉండడంతో పాటుగా వారు కూడా లోపల గదిలో ఉండటం అరుణకుమారి ముందు వరండాలో ఉండటంతో పిల్లలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. సంఘటన సమాచారం తెలుసుకున్న మధిర సీఐ డి. మధు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని అరుణ కుమారి తో మాట్లాడి వివరాలు
అడిగి తెలుసుకున్నారు. సీఐ మధు తో అరుణ్ కుమారి మాట్లాడుతూ తమ కుటుంబానికి చెందిన భూమికి ప్రభుత్వం అందించిన రుణమాఫీ వచ్చిన నేపథ్యంలో తలెత్తిన మనస్పర్ధలు కారణంగా మా మరిది కొడుకు అయిన గుర్రం సాయికుమార్ తనపై ఈ దాడికి పాల్పడ్డాడని తెలిపింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు మధిర రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మీ భార్గవి తెలిపారు. నిందితుడు సాయికుమార్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో అరుణ కుమారిని మధిర సీడీపీఓ శారద శాంతి పరామర్శించారు.
- Tags
- crime