లారీలోడ్ పీడీఎస్ బియ్యం తెచ్చినా సరే కొంటాం..

by Sumithra |
లారీలోడ్ పీడీఎస్ బియ్యం తెచ్చినా సరే కొంటాం..
X

దిశ, గాంధారి : ఆ మండల కేంద్రంలో పీడీఎస్ బియ్యం దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. క్వింటాల్ కాదు, రెండు క్వింటాలు కాదు ఏకంగా లారీ సరిపడా బియ్యం ఉన్నా కొనేందుకు మేము రెడీ అని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని ఓ వ్యాపారస్తుడు పీడీఎఫ్ బియ్యం కొనుగోలు చేయడం, ఆ బియ్యాన్ని వేరే ప్రాంతాలకు చేరవేయడం ఇతని దందా.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న పీడీఎస్ బియ్యాన్ని కొందరు తినలేని వాళ్ళు బయట వ్యాపారస్తులకు అమ్మడం నిషిద్ధం అయినా కొందరు వ్యాపారస్తులు దీన్ని ఆసరాగా చేసుకుని కేజీకి 18 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఇది చాలా ఏళ్లుగా గాంధారి మండల కేంద్రంలో జరుగుతున్న తంతు అయితే అధికారులు ఈ విషయం పై దృష్టి సారించి పోలీస్, సివిల్ సప్లై ఆధ్వర్యంలో సంయుక్తంగా దాడులు నిర్వహించి దాదాపు 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకొని నలుగురి పై కేసు చేశారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత... నలుగురి పై కేసు నమోదు..

గాంధారి మండలంలోని కరక్ వాడి గ్రామంలో చిట్టి ప్యాకల సాయిలు ఇంట్లో 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యంని స్వాధీనం చేసుకుని కేసునమోదు చేశామని స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై, సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ గాంధారి మండల కేంద్రానికి చెందిన ఒడుపుల సంతోష్, పత్తి నవీన్ లు పీడీఎస్ బియ్యాన్ని ప్రజల దగ్గర కిలోల చొప్పున సేకరించి, అటు పై అన్నింటినీ కలిపి ఒక లోడుగా అయ్యేంతవరకు నిల్వ ఉంచి తర్వాత ఒక గూడ్స్ వాహనం నందు తీసుకెళ్లి వేరే ప్రాంతంలో అమ్ముతున్నారని అన్నారు. ఇప్పటికీ 15 క్వింటాళ్ల బియ్యం మాత్రం ప్లాస్టిక్ సంచులలో జమచేసి, కరక్ వాడిలోని సాయిలు ఇంట్లో పెట్టి గాంధారికి చెందిన కందుకూరి వెంకటేశంకి అమ్మడం జరుగుతున్నదని పక్క సమాచారం మేరకు ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు సాయిలు ఇంటిని సోదా చేసి ఆ 15 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం పర్చుకొని, వారి పై కేసునమోదు చేసి బియ్యంని సివిల్ యు సప్లై అధికారులకి అప్పజెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఇందులో భాగంగా పీడీఎస్ బియ్యాన్ని క్రయవిక్రయాల్లో పాలుపంచుకున్న సంతోష్, నవీన్, సాయిలు, వెంకటేశంలపై కేసునమోదు చేశామని ఎస్సై తెలిపారు.

పీడీఎస్ బియ్యం అమ్మినా, కొన్నా నేరమే : ఎస్సై ఆంజనేయులు..

పీడీఎస్ బియ్యం అమ్మినా, కొన్నా లేదా ఒకే దగ్గర దాచిపెట్టి అంతా ఒక్కసారి అమ్ముకుందామని అలా జమ చేసిన తప్పకుండా వారి పై చర్యలు తీసుకుంటామని, కేసునమోదు చేసి ఆ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పజెబుతామని, కాబట్టి రేషన్ బియ్యాన్ని ఎవరు కూడా అమ్ముకోవద్దని ఎవరైనా కొంటే తప్పకుండా సమాచారం అందించాలని తెలిపారు.

Next Story

Most Viewed