గంజాయి ముఠా అరెస్ట్

by Kalyani |
గంజాయి ముఠా అరెస్ట్
X

దిశ, కోదాడ : గంజాయికి బానిసై తాగడంతో పాటు అమ్ముతున్న నిందితులను, కొనుగోలు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకొనగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ రాము తెలిపిన వివరాల ప్రకారం...జింజూరీ సింహాద్రి (సందీప్), ఓబులోజు అరవింద్ , పరారీలో ఉన్న సుజిత్, ఏసుబాబు లకు గంజాయి తాగడంతో పాటు అమ్మడం అలవాటు ఉన్నది .వీరు నలుగురు కలసి ఒడిస్సా రాష్ట్రం పుస్పలంక వెళ్ళగా కొద్ది దూరంలో జింజూరీ సింహాద్రి, ఓబులోజు అరవింద్ ను ఉంచి సుజిత్, ఏసుబాబు కలిసి వెళ్ళి 5 కిలోల గంజాయిని కొనుగోలు చేశారు.

2 ½ కిలోల గంజాయిని సింహాద్రి, అరవింద్ కు ఇచ్చి మిగతా 2 ½ కిలోల గంజాయిని సుజిత్, ఏసుబాబు తీసుకొని వెళ్ళాడు. సింహాద్రి, అరవింద్ కలిసి అందులో కొంత గంజాయి తాగి మిగతా గంజాయిని ఎక్కువ రేటుకు అమ్మడానికి కోదాడ వచ్చి కోదాడ ఎన్ హెచ్ 65 రోడ్ వెంట గల గోల్డెన్ సిటీ 2 వెంచర్ నందు సింకోజు అఖిల్, గంటా మొసెస్, జిల్లెల రాంబాబు, శ్రీనాద్, తాళ్ళూరి సంజయ్ లకు అమ్ముతుండగా పోలీసులు మాటు వేసి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న 2 ¼ కిలోల గంజాయిని స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ గంజాయి విలువ సుమారుగా రూ. 10,000/-రూపాయల వరకు ఉంటుంది.

ఏడుగురు నేరస్తులను మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ టాస్క్ లో టి, రాము ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోదాడ టౌన్, ఏ.రంజిత్ రెడ్డి యస్.ఐ. కోదాడ టౌన్, పోలీస్ సిబ్భంది హెడ్ కానిస్టేబుల్ బాల్తు శ్రీను, కానిస్టేబుల్స్ యల్లారెడ్డి, సతీష్, యాకూబ్, బుడిగ నాగేశ్వర్ రావు లు పాల్గొన్నారు. గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులను డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story