కంబదూరులో బాలుడి కిడ్నాప్ కు యత్నం

by Disha Web Desk 18 |
కంబదూరులో బాలుడి కిడ్నాప్ కు యత్నం
X

దిశ,కళ్యాణదుర్గం:కంబదూరు వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో ఉన్న కోటవీధిలో బాలుడి కిడ్నాప్ యత్నం స్థానికంగా కలకలం రేపింది.పూర్తి వివరాలకు వెళితే గురువారం రాత్రి ఆర్టీసీ కండక్టర్ బలిజ గంగాధర కుమారుడు గౌతమ్ కౌశిక్ వారి తాతతో కలిసి ఇంటి బయట మంచం మీద నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తల్లిదండ్రులు మీడియాకు తెలిపారు. రాత్రి 11 గంటలకు పైగా ఆ ప్రాంతంలో ఒక కారు హల్చల్ చేసినట్లు బాలుడు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ వీధిలో ఒక కారు పోయిన 15 నిమిషాలకే గుర్తు తెలియని ఒక వ్యక్తి వచ్చి మంచం మీద పడుకున్న బాలుడు పై చెయ్యి వేసి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు.

వెంటనే పక్కనే ఉన్న తాతకు చెయ్యి తగలడంతో ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించి గట్టిగా కేకలు వేయడంతో బాలుడిని అక్కడే వదిలేసి పరారైనట్లు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాలుడు తల్లిదండ్రులు 100కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బాలురు కుటుంబ సభ్యులు తెలిపారు. కంబదూరు లోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తే దొంగలు దొరికే అవకాశం ఉందని ప్రజలు వాపోతున్నారు.కంబదూరు చెక్ పోస్ట్, వైఎస్ఆర్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ ,పాత పోస్ట్ ఆఫీస్, పాత బస్టాండ్ ,ఆర్టీసీ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు పోలీసులు కోరుతున్నారు.


Next Story

Most Viewed