- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > old crime > Insta Reels: ప్రాణాలు తీస్తున్న ఇన్‌స్టా రీల్స్.. రంగారెడ్డి జిల్లాలో మరో యువకుడు బలి
Insta Reels: ప్రాణాలు తీస్తున్న ఇన్‌స్టా రీల్స్.. రంగారెడ్డి జిల్లాలో మరో యువకుడు బలి
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ‘ఇన్‌స్టా రీల్స్’ ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. లైక్స్, కామెంట్స్ కోసం యువత ఎంతటి సాహసానికైనా ఒడిగడుతున్నారు. తమకు అనుభవం లేకపోయిన చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తూ.. ప్రాణాల మీద తెచ్చుకుని కన్నోళ్లకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ సమీపంలో నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు వర్షంలో బైక్‌పై స్టంట్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో శివ అనే యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. అదేవిధంగా డ్రైవింగ్ చేస్తున్న మరో యువకుడికి తీవ్ర గాయలు కాగా స్థానిక గమనించి అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story