- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD : IPL మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా మరో వ్యక్తి అరెస్ట్
దిశ, క్రైమ్ బ్యూరో : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్‌లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరినీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 100 టికెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ సుశీల్‌లు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా స్నేహితులు అయ్యారు. ఈ ఇద్దరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ద్వారా ఇతరుల ఐడీలతో టికెట్‌లను సేకరిస్తున్నారు. ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ ల ద్వారా రీడెంప్షన్ కేంద్రాలలో టికెట్‌లను తీసుకుని వాటిని బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలా ఈ ఇద్దరు టికెట్‌ల కొరతను సృష్టించి అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. వీరి బ్లాక్ టికెట్ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 ఐపీఎల్ టికెట్‌లు, మొబైల్ ఫోన్స్‌ను రికవరీ చేశారు.