భార్యని చంపి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య

by Aamani |
భార్యని చంపి భర్త ఉరి వేసుకుని  ఆత్మహత్య
X

దిశ, మక్తల్: భర్తకు భార్యపై అనుమానం పెనుభూతమైంది. సైకో గా మారి భార్య సంద్య (20) పదునైనా ఆయుధంతో గొంతు కోసి తను తిమ్మప్ప24) ఇంట్లో దూలానికి ఉరేసుకొని చనిపోయిన సంఘటన నియోజకవర్గంలోని కృష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలో ముడుమాల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగింది. ఆరు నెలలు కలిసి జీవించిన తేడాతో ఇద్దరూ విగత జీవులైన చివరికి పోస్టుమార్టం రూంలో ఒకే అరుగుపై ఇద్దరిని ఉంచడం పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన తో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

గ్రామస్తుల కథనం ప్రకారం కృష్ణ మండలం ముడుమూల గ్రామానికి చెందిన తిమ్మాప్పతో కర్ణాటకలోని యాదగిరి జిల్లా బాడేలా గ్రామానికి చెందిన సంధ్యతో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది. సవ్యంగా సాగుతున్న వీర కాపురంలో అనుకోకుండా భర్త తిమ్మప్ప కు అనుమానం మొదలై రెండు నెలల నుండి భార్యను వేధించడం, కొడుతుండేవాడని,దీంతో ఇరు కుటుంబాల వాళ్లు ఇంటి వలనే పంచాయితీ పెట్టి సర్ది చెప్పడం జరిగింది.భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటన్నారని, అయితే భార్యాభర్తలు ఇద్దరూ బుధవారం 11 గంటల ప్రాంతంలో మక్తల్ వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు సమాచారం.

ఇంటికి తిరిగి వెళ్ళిన వీరు భార్యతో గొడవపడి పదునైన ఆయుధంతో గొంతుపై కాటు వేయడంతో తీవ్ర గాయంతో కింద పడిపోయిన స్థితిని చూసి భార్య చనిపోయిందని భయపడి ఇంట్లోకి వెళ్లి దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన సంధ్యను రాయచూర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోవడంతో వెనక్కి తీసుకొచ్చారు. సమాచారం తెలుసుకున్న కృష్ణ ఎస్సై నవీద్ , సీఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని విషయాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. పోస్టుమార్టం కై భార్యాభర్తల మృతదేహాలను మక్తల్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed