Iran warns: దాడులకు పాల్పడితే ప్రతీకారం తప్పదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు ఇరాన్ వార్నింగ్

by vinod kumar |
Iran warns: దాడులకు పాల్పడితే ప్రతీకారం తప్పదు.. ఇజ్రాయెల్, అమెరికాలకు ఇరాన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్(Iran) సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్(Israel) భీకర దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayatollah Ali Khamenei) ఇజ్రాయెల్, అమెరికా(Amerika)లకు వార్నింగ్ (warning) ఇచ్చారు. ఇరాన్, దాని మిత్ర పక్షాలపై దాడులకు పాల్పడితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని తెలిపారు. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ‘శత్రువులు జియోనిస్ట్ పాలకులు అయినా, యూఎస్ అయినా తగిన సమాధానం ఇస్తాం. వారు చేస్తున్న అరాచకాలకు ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. అయితే దాడి ఎప్పుడు, ఎక్కడ చేస్తాం అనే విషయాలను ఖమేనీ వెల్లడించలేదు. కాగా, ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో పశ్చిమాసియాలో లాంగ్ రేంజ్ బీ-52 బాంబర్ ఎయిర్‌క్రాఫ్ట్(Air crafts), బాలిస్టిక్ మిస్సైల్(Balistic missiles) డిఫెన్స్ డిస్ట్రాయర్‌లను మోహరించినట్టు యూఎస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఖమేనీ హెచ్చరికలు జారీ చేయడం ప్రాధాన్యత సంచరించుకుంది.

Next Story