Brahmamudi November 2nd Episode : కావ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజ్

by Prasanna |   ( Updated:2024-11-02 11:17:06.0  )
Brahmamudi November 2nd Episode : కావ్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన రాజ్
X

దిశ, వెబ్ డెస్క్ : బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

అమ్మమ్మగారు ఇలాంటి శుభ వార్తను ఇంత లేట్ గానా చెప్పేది అని కావ్య అంటుంది. తల్లీ ప్రవర్తన చాలా మారిపోయింది. ఇక కొడుకు మాత్రమే ఉన్నాడు. వాడు కూడా మారిపోతే ఇక ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవని ఇందిరాదేవి అంటుంది. కట్ చేస్తే రాజ్, కావ్యతో ఫోన్ కాల్ మాట్లాడుతాడు. ఇప్పుడు, మళ్ళీ ఎలాంటి నాటకం ఆడి వాళ్లను నీ వైపుకు తిప్పుకున్నావ్ అని రాజ్ అంటాడు. దాంతో, ఒక్కసారిగా కావ్య బాధ పడుతుంది.

ఎదుటి వాళ్ళని మోసం చేయడం, వాళ్ళని ఎదురు దెబ్బ కొట్టడం, నీకు కావాల్సింది వేరే వాళ్ళ దగ్గర ఎలాగైనా సాధించుకోవడం తప్ప నీకేం తెలుసు. నువ్ ఆడే నాటకాలు మా అమ్మ నాన్న మీద ప్రయోగించాలని చూస్తే నీకు అసలు మంచిగా ఉండదని రాజ్ కోపంగా వార్నింగ్ ఇస్తాడు. అదంతా వింటున్న కావ్యకు కోపం బాగా వస్తుంది. దాంతో, రాజ్ కు వరుసగా ఎమోషనల్ డైలాగ్స్ వేస్తుంది. అనామికను టైం చూసి దెబ్బ కొట్టడం, అపర్ణ మారిపోవడానికి కారణం తను కాదని కావ్య, రాజ్ తో గొడవ పడుతుంది.

Advertisement

Next Story