- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sajjanar : కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు.. స్పెషల్ ప్యాకేజీలు: వీసీ సజ్జనార్
దిశ, డైనమిక్ బ్యూరో: TGSRTC పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ VC Sajjanar తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట, తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు పథకం, తదితర అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి శనివారం వర్చ్‌వల్‌గా ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ నిర్వహించారు.
ఆర్టీసీకి కార్తీక మాసం, శబరిమల ఆపరేషన్స్ ఎంతో కీలకమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఆది, సోమవారాలు శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి నేపథ్యంలో తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో చేసుకోవాలన్నారు. మరిన్నీ వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని సూచించారు.
బస్ ఆన్ కాంట్రాక్ట్(బీవోసీ) చార్జీలు తగ్గింపు
అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించినట్లు సజ్జనర్ తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్‌కు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డిలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమలకు, శుభముహుర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.