పాత కక్షల కారణంగా కత్తులతో వీరంగం

by Rajesh |
పాత కక్షల కారణంగా కత్తులతో వీరంగం
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర శివారులోని బొర్గం పి గ్రామ పరిధిలో గల సత్యనారాయణ స్వామి ఆలయ సమీపంలో ఉన్న కాలనీలో శుక్రవారం రాత్రి కొందరు వ్యక్తులు కత్తులతో వీరంగం సృష్టించారు. శుక్రవారం మధ్యాహ్నం అదే ప్రాంతంలో తలెత్తిన చిన్నపాటి మొబైల్ చోరీ ఘర్షణ రాత్రి కత్తులతో ఒకరినొకరు దాడులు చేసుకోవాల్సిన పరిస్థితికి దారితీసింది. ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి సంబంధించిన మొబైల్ దొంగిలించారని అనుమానంతో ఆ కాలనీకి చెందిన వ్యక్తులపై అమానుషంగా దాడికి దిగారని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం మొదలైన ఈ ఘర్షణతో తమకు ఎలాంటి సంబంధం లేని మొబైల్ చోరీలో కావాలని పాత కక్షలతో వేధింపులతో దాడికి పాల్పడ్డారని తెలిపారు.

సంబంధిత నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని వారు ఆరోపించారు. పోలీసులు తాము ఫిర్యాదు చేసిన సమయంలో వెంటనే స్పందించి ఉంటే తమపై కత్తుల దాడి కాకుండా ఉండేదని వారు పేర్కొన్నారు. కత్తుల దాడిలో తీవ్రంగా గాయాలైన బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడిలో గాయపడిన వారు మహిళలు ఉండడం గమనార్హం. అయితే ఇదివరకే

గంజాయికి బానిసగా మారిన నిందితులు ప్రసాద్ అతని బందువులైన మల్లేష్, దశరథ్, సాయిలు, గంగామణి, బన్నీ, భార్గవ్, లక్ష్మణ్, రాజవ్వ లతో కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ప్రసాద్‌పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో కక్ష పెంచుకొని సిరికొండ శంకర్, తల్లి పోసానిపై కత్తితో దాడికి దిగారని తెలుస్తుంది. అంతేగాక తమ్ముడు గోపాల్, అక్క మీనలపై ఇటుకలతో దాడి చేయగా చికిత్సల నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరారు.

Advertisement

Next Story