విద్యార్థినిపై హెచ్ఎం లైంగిక వేధింపులు.. 9 మందిపై పోక్సో చట్టం కేసు నమోదు

by Ramesh N |
విద్యార్థినిపై హెచ్ఎం లైంగిక వేధింపులు.. 9 మందిపై పోక్సో చట్టం కేసు నమోదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని ఏకంగా ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన కామారెడ్డిలో కలకలం రేపుతోంది. బాన్సువాడ మండలం దేశాయ్‌పేట ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థినిపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని భయంతో ఆ విషయం తోటి విద్యార్థులకు తెలుపడంతో విషయం బయటపడింది. మరో నలుగురైదుగురు విద్యార్థినులను సైతం హెచ్ఎం అసభ్యంగా ప్రవర్తిచారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్థులతో కలసి పాఠశాలకు వెళ్లి నిలదీశారు.

ఈ నేపథ్యంలోనే విషయం బాలల సంక్షేమ కమిటీ సభ్యుల వద్దకు చేరడంతో విద్యార్థినిపై హెచ్ఎం లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేలింది. దీంతో హచ్ఎం నరేందర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే హెచ్ఎం విషయం బయటకు రాకుండా ప్రయత్నించారని మరో 9 మందిపై కూడా పోక్సో కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed