- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఒకే లారీని రెండు సార్లు చోరీ చేశాడు...
దిశ,తాండూరు : ఓ దొంగ ఒకే లారీని రెండు సార్లు చోరీ చేసి పోలీసులకు చిక్కిన వైనం ఇది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలో పార్క్ చేసిన లారీని అపహరించుకుపోయిన వ్యక్తిని కరణ్ కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై విఠల్ రెడ్డి మాట్లాడుతూ కరణ్ కోట్ గ్రామ శివారులోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఈనెల 18న లారీని అదే గ్రామానికి చెందిన వడ్డె కాశప్ప అనే వ్యక్తి పార్కు చేసి ఉన్న
లారీని అపహరించుకొని కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో విక్రయించేందుకు ప్రణాళిక వేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు. ఈ విషయంపై లారీ ఓనర్ ఎండీ. అతీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. అపహరించుకొని పోయిన లారీలో డీజిల్ అయిపోవడంతో మార్గమధ్యలో లారీని వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కాగా గతేడాది కూడా ఇదే లారీని అపహరించుకొని వెళ్లినట్టు నిందితుడు తెలిపాడు.
- Tags
- Lorry theft