- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉపాధి వేటలో ఆగిన ఊపిరి.. తనువు చాలించిన మరో వలస జీవి
దిశ,కోరుట్ల రూరల్: మండంలోని యూసుఫ్ నగర్ గ్రామానికి చెందిన ఉత్కం శ్రీనివాస్ గౌడ్( 49 ) ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ బాట పట్టాడు. ఉండటానికి ఇల్లు, పని చేసుకునేందుకు గుంట భూమి లేకపోవడంతో తప్పనిసరై గల్ఫ్ ఉపాధికై బయలుదేరాడు. భార్య బీడీలు చుడుతూ ఇద్దరు పిల్లలను చూసుకుంటుంటే, వారి బాగు కోసం ఎడారి దేశంలో కాయకష్టం చేసే పనిలో కుదిరాడు. గత 8 సంవత్సరాలుగా దుబాయ్ లో పనిచేస్తున్నాడు. ఎడారి దేశపు ఎండలో పని చేస్తున్న క్రమంలో గత నెల 17వ తేదీన వడదెబ్బ తగిలి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతున్న సమయంలో తీవ్రమైన గుండెపోటుతో మృతి చెందాడు.
దీంతో పిల్లలు కూతురు, కొడుకులతో పాటు భార్య దిక్కులేని వారయ్యారు. తమదంటూ ఏమీలేని ఆ కుటుంబం తమ ఏకైక పెద్దదిక్కును కోల్పోయి కుదేలైంది. పిల్లల చదువులు, పెళ్లిళ్ల వంటి ప్రధాన బాధ్యతలు ముందున్న సమయంలో ఇంటి మనిషి లోకాన్ని విడిచి వెళ్లడంతో వారి బాధ వర్ణనాతీతం గా ఉంది. శ్రీనివాస్ మృతదేహం గురువారం గ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబం రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. గల్ఫ్ బాధితుల సంక్షేమ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని, అలాగే శ్రీనివాస్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.