- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా బాలిక కిడ్నాప్
దిశ, శేరిలింగంపల్లి : స్కూల్ నుండి వస్తున్న బాలిక కిడ్నాప్ కు గురవగ్గా పోలీసులు కొన్ని గంటల్లోనే ఛేదించారు. రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాయదుర్గంలో రోజులాగే స్కూల్ కు వెళ్లిన బాలిక (9) సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా ఓ వ్యక్తి పాపను తనతో పాటు తీసుకువెళ్లాడు. ఆ చిన్నారి సాయంత్రం కావస్తున్నా
ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తి తనతో పాటు పాపను తీసుకెళ్లినట్టు గుర్తించిన పోలీసులు ఆ వ్యక్తిని గంటల వ్యవధిలోనే గుర్తించారు. కిడ్నాప్ కు గురైన బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు విచారిస్తున్నారు.
- Tags
- kidnapped