పాఠశాలలో దారుణం.. క్లాస్‌మేట్‌పై లైంగిక వేధింపులు

by Vinod kumar |
పాఠశాలలో దారుణం.. క్లాస్‌మేట్‌పై లైంగిక వేధింపులు
X

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని నోయిడాలో ఉన్న ప్రముఖ ప్రైవేటు పాఠశాలలో దారుణం జరిగింది. 11వ తరగతి విద్యార్థిని (16)పై అదే క్లాస్ కు చెందిన ఐదుగురు విద్యార్థులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో ఆమెపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. అక్టోబరు 9న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

‘‘ఆ ఐదుగురి లైంగిక వేధింపులను అడ్డుకునేందుకు నేను ప్రతిఘటించగా వాళ్లు మూకుమ్మడిగా బెదిరించారు. ఇంకోసారి మమ్మల్ని ప్రతిఘటిస్తే రేప్ చేస్తామని నాకు వార్నింగ్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా కొట్టారు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలిక ఆరోపించింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు ఐదుగురు బాలురపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేస్తున్నామని, దాని ఆధారంగా విచారణ చేస్తున్నామని డీసీపీ హరీశ్ చందర్ వెల్లడించారు.

Advertisement

Next Story