- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గంజాయికి అలవాటు పడి...ఆపై కొనుగోలు చేసి...
దిశ, లింగాల ఘణపురం : గంజాయి తాగడం నేర్చుకొని...ఆపై కొనుగోలు చేసి... పోలీసులకు చిక్కిన ఉదంతం ఇది. మండలంలోని వడ్డిచర్ల గ్రామానికి చెందిన సాతెల్లి కార్తీక్ అనే యువకుని వద్ద గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ భీమ్ శర్మ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ కార్తీక్ గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నాడన్న పక్కా సమాచారంతో ఎస్ఐ శ్రావణ్ కుమార్, సిబ్బందితో వడ్డి చర్ల గ్రామంలోని కార్తీక్ ఇంటికి వెళ్లగా పోలీసులను చూసి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడని తెలిపారు. అదుపులోకి తీసుకొని విచారించగా జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కళాశాలలో ఎంఎల్టీ చదువుతుండగా
మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన బొల్లం పల్లి మణికంఠ అనే స్నేహితుని ద్వారా గంజాయి తాగడం నేర్చుకున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం హైదరాబాద్ తీసుకువెళ్లగా దూల్పేట తదితర ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి రాత్రి వేళ సేవించేవాడని తెలిపారు. సాతెల్లి కార్తీక్ వద్ద ఉన్న 75 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ కృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా గంజాయి తాగినట్టు కానీ సరఫరా చేసినట్టు కానీ అనుమానం వస్తే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఏసీపీ భీమ్ శర్మ కోరారు.
- Tags
- ganja