- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
arrest : దొంగ నోట్ల ముఠా అరెస్ట్
దిశ, మెట్ పల్లి : నకిలీ నోట్లు చలామని చేస్తూ జల్సా కు అలవాటు పడ్డ ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు మెట్ పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగిత్యాల జిల్లా తాళ్ల ధర్మారంనకు చెందిన సదాల సంజీవ్, జగిత్యాల పట్టణానికి బిట్టు@ శివకుమార్, నిర్మల్ జిల్లాకు చెందిన మగ్గిడి కిషన్, కళకుంట్ల గంగారం, బొంగురాల పుల్లయ్య, మునిమేకల అశోక్ ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి దాదాపు 7 లక్షల నకిలీ నోట్లు, ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం, ఆరు సెల్ఫోన్లు, ఐదువేల 50 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గత సంవత్సర కాలంగా వీరు ఇద్దరు చొప్పున ఒక ముఠాగా ఏర్పడి హైదరాబాద్,ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలో కొందరి వద్ద 10 లక్షల వరకు డబ్బులు లాక్కొని పరారీలో ఉన్న వీరు ఈనెల 1వ తేదీన స్థానిక పెద్దగుండు వద్ద దాబా యజమాని రాజేందర్ వద్ద లక్ష లాక్కొని వెళ్లిపోగా రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవిలు గాలింపు చర్యలో భాగంగా వెంకట్రావుపేట్ వీరేంద్ర దాబాలో గుర్తించి ఆరుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించామని తెలిపారు. నకిలీ నోట్ల ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ నిరంజన్ రెడ్డి,ఎస్సై చిరంజీవి, రాజు, పోలీస్ సిబ్బందిని, డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు.
- Tags
- arrest