- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
గాజులరామారం కాల్పుల నిందితులు అరెస్ట్
దిశ, పేట్ బషీరాబాద్ : పెట్రోల్ దొంగతనం ఘర్షణ కాల్పులకు దారి తీసిన ఘటనలో నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో బాలనగర్ డీసీపీ కోటిరెడ్డి వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మల్లంపేటకు చెందిన చేబ్రోలు పూర్ణిమ (35), అజయ్ చంద్ర (21), గౌతం (24) లు ఈనెల 28వ తారీకు రాత్రి ఒంటిగంట సమయంలో మల్లంపేట నుంచి గాజులరామారంనకు అవెంజర్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఆ సందర్భంలో అండ్ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. దీంతో గౌతం బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనం నుంచి పెట్రోల్ చోరీ చేయటానికి ప్రయత్నించాడు.
చోరీ యత్నాన్ని గమనించిన బార్ క్యాషియర్ అఖిలేష్ గౌతమ్ ను ప్రశ్నించాడు. దీనికి గౌతం దుర్భాషలాడుతూ అఖిలేష్ పై తిరగబడ్డాడు. బయట గొడవ జరుగుతుండడంతో బార్ లో పనిచేసే వ్యక్తులు బయటకు రావడంతో గొడవ పెద్దదైంది. అయితే పూర్ణిమ తనకు తెలిసిన మల్లంపేట కు చెందిన నరేష్ కు ఫోన్ చేయడంతో అతను శివ అనే వ్యక్తితో కలిసి తార్ వాహనం లో గొడవ జరుగుతున్న ప్రాంతానికి వచ్చాడు. అదేవిధంగా నరేష్ ఫ్రెండ్స్ పైన సోహెల్, సైమన్స్ , నరేందర్, ఉజ్వల్ లు మరో బెలైనో వాహనంలో అక్కడకు చేరుకున్నారు. వీరి రాకతో గొడవ పెద్దది కావడంతో నరేష్ తనతో వచ్చిన శివను గన్ తో ఫైర్ చేయమని చెప్పడంతో శివ ఒకసారి గాల్లోకి మరొకసారి అక్కడ గొడవ పడుతున్న బార్ అండ్ రెస్టారెంట్ వారిపై కాల్పులు జరిపాడు. దీంతో బార్ కు సంబంధించిన అఖిలేష్, నిశాంత్, ఇతర వర్కర్స్ పారిపోతుండగా నరేష్ తన తార్ వాహనంతో నిశాంత్ మీదకు దూసుకెళ్లాడు. దీంతో నిశాంత్ కు గాయాలు అయ్యాయి. అనంతరం నరేష్ జీడిమెట్ల పోలీసులకు బార్ అండ్ రెస్టారెంట్ వాళ్లే గౌతమ్ని కొట్టి బెదిరించారని అజయ్ చంద్ర తో ఫిర్యాదు ఇప్పించి వెళ్లిపోయారు.
ఉదయం కాల్పుల ఘటన వెలుగులోకి..
అప్పటివరకు కేవలం ఘర్షణగానే భావించిన పోలీసులు ఉదయం 6 గంటల ప్రాంతంలో అఖిలేష్ పోలీస్ స్టేషన్కు వచ్చి పిస్టల్ తో కాల్పులు జరిపారని ఫిర్యాదు చేశాడు. దీంతో కాల్పుల ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్ణిమ , గౌతమ్, అజయ్ చంద్ర, సోహెల్, సాంసంగ్, నరేందర్, ఉజ్వల్ లను అదుపులోకి తీసుకొని జరిగిన ఘటనపై విచారణ చేశారు.
ల్యాండ్ సెటిల్మెంట్ ల కోసం గన్ కొనుగోలు
ఒక నెల క్రితం నరేష్ తన స్నేహితులైన సమీర్, బుగ్గప్ప, కిరణ్, జగ్గు లతో బీహార్ కు కలిసి వెళ్లి గతంలో పరిచయమున్న అమిత్ సహాయంతో ఒక దేశావలి పిస్టల్ తో పాటుగా 100 బుల్లెట్లను రూ. 80 వేలకు కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న నరేష్ తన వ్యాపారంలో ఎవరైనా అడ్డువస్తే తన వద్ద ఉన్న గన్‌తో బెదిరించి భూములను లాక్కునేందుకు పిస్టల్ కొన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కాల్పులు చేసిన పిస్టల్ బుల్లెట్లను శ్రీకాంత్ అనే వ్యక్తి వద్ద దాచడంతో పోలీసులు శ్రీకాంత్ ను కూడా అదుపులోకి తీసుకొని పిస్టల్ తో పాటుగా 37 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కూకట్పల్లి ప్రాంతంలో స్కోడా కార్ లో తిరుగుతున్న నరేష్, సమీర్ లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 50 బుల్లెట్లను, ఒక కార్‌ను స్వాధీనం చేసుకున్నారు.
క్లారిటీ లేని ప్రశ్నలు ఎన్నో..
ఇక కాల్పుల ఘటనపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో చాలా విషయాలు పోలీసులు దాటివేశారు. చేబ్రోలు పూర్ణిమ అర్ధరాత్రి సమయంలో గాజులరామారం ఎందుకు రావాల్సి వచ్చింది అనే ప్రశ్నకు ఆమె అక్కడే ఉంటుందని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే పోలీసులు ఇచ్చిన ప్రెస్ నోట్ లో పూర్ణిమ మల్లంపేట నివాసిగా పేర్కొన్నారు. పూర్ణిమ తో పాటుగా ద్విచక్ర వాహనంపై వచ్చిన అజయ్ చంద్ర వయసు ప్రెస్ నోట్ లోనే ఒకసారి 28 సంవత్సరాలుగా, మరొకసారి ఇరవై ఒక్క సంవత్సరాలుగా పేర్కొన్నారు. సాధారణంగా నిందితుల వివరాలు తెలిపే ముందు వారి ఆక్యుపేషన్ వివరాలను కూడా పోలీసులు అందజేస్తారు. కానీ ఈ విషయంలో మాత్రం కేవలం వారి పేరు ఊరు వయసును మాత్రమే పేర్కొన్నారు.
కాల్పుల ఘటనలో పాత్రధారి అయిన నరేష్ పై సంగారెడ్డి లో ఒక కేసు, దుండిగల్ పీఎస్ లో నాలుగు కేసులు ఉన్నట్లుగా చెప్పారు. అయితే ఆ కేసు వివరాలను ఇచ్చిన ప్రెస్ నోట్ లో పేర్కొనలేదు. నేర చరిత్ర కలిగిన నిందితులు పట్టుపడితే వారికి సంబంధించిన కేసుల వివరాలను ప్రెస్ నోట్లో పోలీసులు తెలియజేసిన సందర్భాలు అనేకం. అయితే ఈ కాల్పుల ఘటన కేసులో నరేష్ పై నమోదైన కేసులు వివరాలను తెలపలేదు. అయితే కాల్పుల విషయం అదే రోజు రాత్రి ఒంటిగంట సమయంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది.
మరి పోలీసులు తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఫిర్యాదుదారుడు కాల్పులు విషయం చెప్పడంతోనే తెలిసిందని చెప్పడం అనుమానాలకు తావిస్తుంది. అదే రోజు రాత్రి నరేష్ అతని మిత్రులు పోలీస్ స్టేషన్ వద్ద కూడా వీరంగం చేసి, ఫిర్యాదు చేశారు. మరి ఆ సమయంలో వారిని ఎందుకు వదిలేశారు అన్నది మరో ప్రశ్న. మొత్తానికి కేసు, నిందితుల వివరాలపై పోలీసులు పూర్తి సమాచారం స్పష్టంగా ఇవ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
- Tags
- arrest