- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
judgment : అవినీతికి పాల్పడిన సీఐకి ఐదేళ్ల జైలు
దిశ, కరీంనగర్ లీగల్ : ఒక కేసులో నిందితున్ని రిమాండ్ కు తరలించేందుకు గాను లంచం డిమాండ్ చేసిన సీఐని బాధితురాలి ఫిర్యాదు మేరకు ఏసీబీ పోలీసులు వలపన్ని పట్టుకోగా బుధవారం కరీంనగర్ జిల్లా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ నిందితునికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. అదిలాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్లో ఉప్పుల కృష్ణ అనే వ్యక్తిపై 2013 సంవత్సరంలో కేసు నమోదు కాగా ఈ కేసులో అతన్ని రిమాండ్ చేసి కోర్టులో హాజరు పరిచేందుకు నిందితుని
తల్లి శశికళ వద్ద అప్పటి సీఐ చింతపట్ల లచ్చన్న రూ.10 వేలు డిమాండ్ చేశారు. కాగా శశికళ ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. ఏసీబీ అధికారుల సూచన మేరకు శశికళ లంచం డబ్బులను సీఐకి అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ కేసులో సాక్షులను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిషోర్ విచారించారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి కుమార్ వివేక్ నిందితుడు చింతపట్ల లచ్చన్నకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించారు.
- Tags
- judgment