మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు

by GSrikanth |
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య.. పోస్టుమార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉన్నావ్‌లో మీనూ అనే మహిళా కానిస్టేబుల్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో విగత జీవిగా పడివున్న ఆమెను గురించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించిందని నిర్ధారించారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో మాత్రం ఆమె ఒంటిపై 500 లకు పైగా గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇదిలా ఉండగా.. కానిస్టేబుల్ మీనూ ఇటీవల ఓ యువకుడ్ని ప్రేమించింది. అతడికి వేరే యువతితో పెళ్లి జరిగింది. తట్టుకోలేక.. అతడు లేకుండా ఒంటిరిగా జీవించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story