తిరుమలాయపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌లు ఢీకొని ఇద్దరు దుర్మరణం

by Shiva |
తిరుమలాయపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్‌లు ఢీకొని ఇద్దరు దుర్మరణం
X

దిశ, తిరుమలాయపాలెం: తిరుమలాయపాలెం స్టేజీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం బోడతండాకు చెందిన బోడ రమేశ్ అనే వ్యక్తి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. రమేశ్ బైక్‌పై ఖమ్మం వెళ్లి తిరిగి వస్తుండంగా.. ఖానాపురంనికి చెందిన షేక్ ముజాకిల్(19), ఖమ్మం బుర్హనపురానికి చెందిన సాయి తనీష్, ఇల్లందుకు చెందిన మహ్మద్ పాషా అనే ముగ్గురు యువకులు, స్కూటీ వాహనంపై మరిపెడ బంగ్లా నుంచి ఖమ్మం వైపుగా వెళ్తున్నారు.

మార్గ మధ్యలో తిరుమలాయపాలెం స్టేజి వద్దకు రాగానే రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బోడ రమేశ్, షేక్ ముజాకిల్ అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా సాయి తనీష్, మహ్మద్ పాషా అనే ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జనార్దన్, ఎస్సై గిరిధర్ రెడ్డి క్షతగాత్రులను 108‌ అంబులెన్స్‌లో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed