టపాసులు తయారు చేస్తుండగా పేలుడు

by Sridhar Babu |
టపాసులు తయారు చేస్తుండగా పేలుడు
X

దిశ, చార్మినార్​ : పాతబస్తీలోని ఓ ఇంట్లో అక్రమంగా టపాసులు తయారు చేస్తుండగా ఐదుగురికి గాయాలైన ఘటన బహదూర్​పురా పోలీస్​స్టేషన్​ పరిధిలో బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం రేపింది. బహదూర్​పురా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... పాతబస్తీ బహదూర్​పురాలోని కిషన్​బాగ్​ కాశీబుగ్గ దేవాలయం సమీప ప్రాంతంలో ఆరు నెలల క్రితం షకీరా బేగం(55), హఫీజ్​ దంపతులు ఇల్లు కొనుగోలు చేశారు. వీరికి సమీనా బేగం (27), మొహమ్మద్​ వసీమ్(29)​ సంతానం. అయితే సమీనా బేగం ఇద్దరు పిల్లలు కూడా షకీరాబేగం వద్దనే ఉంటున్నారు. దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో కిందకు నేలకు కొట్టే లైసెన్స్​ టాపాసులు ఇంట్లో అక్రమంగా తయారు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఆ టపాసులకు కావాల్సిన కెమికల్స్​, గులకరాళ్లు నిలువ ఉంచుకున్నారు.

కాగా గత కొంత కాలంగా తయారు చేసిన టపాసులు కూడా పెద్ద మొత్తంలోనే నిలువ ఉన్నాయి. దీంతో బుధవారం సాయంత్రం టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా అవి పేలాయి. ఇంటి రేకులు , గృహోపకరణ వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పక్కింటికి చెందిన అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. గ్యాస్ సిలిండర్ లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో షకీరా బేగం, సమీనా బేగంకు తీవ్రగాయాలయ్యాయి. హఫీజ్​, వసీమ్​లతో పాటు మరో ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బహదూర్​పురా పోలీసులు హుటాహూటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ఆరుగురిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును బహదూర్​పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed