ఒకే కుటుంబంలో నలుగురికి విద్యుత్ షాక్

by Sridhar Babu |
ఒకే కుటుంబంలో  నలుగురికి విద్యుత్ షాక్
X

దిశ, చేర్యాల : చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి ఇంట్లో విద్యుత్ షాక్ రావడంతో బైర ఐలవ్వ (60) అక్కడికక్కడే మృతి చెందింది. విషయాన్ని గమనించిన పొరుగింటి భైర ఐలయ్య చాకచక్యంగా ముగ్గురిని ప్రాణాలతో కాపాడారు. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన బైర అంజయ్య రేకుల షెడ్డులో నివాసం ఉంటుండగా కుంటుంబానికి చెందిన అతని భార్య ఐలవ్వ, కొడుకు అనిల్, కోడలు రమ్య, కూతురు శ్యామల గురువారం సాయంత్రం వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి రాగా

ఇంటి ఆవరణలో దండెం పైన ఆరేసిన బట్టలు తీసే క్రమంలో సర్వీస్ వైరు తేలి రేకులకు తాకడంతో మొదట ఐలవ్వకు విద్యుత్​ షాక్ తగిలింది. ఆమెను రక్షించే క్రమంలో మిగతా ముగ్గురు విద్యుత్ షాక్ కి గురయ్యారు. విషయాన్ని గమనించిన పొరుగు ఇంటి భైర ఐలయ్య చాకచక్యంగా వ్యవహరించి కర్ర సహాయంతో విద్యుత్ సరఫరాను నిలిపి వేయడంతో ప్రమాదం నుండి మిగతా ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. వీకిని చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రాణాలకు తెగించి ముగ్గురి ప్రాణాలను కాపాడిన ఐలయ్య ను గ్రామస్తులు, పోలీసులు అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed