Jubilee Hills Pub : జూబ్లీహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ కలకలం..

by Sumithra |
Jubilee Hills Pub : జూబ్లీహిల్స్‌ పబ్‌లో డ్రగ్స్‌ కలకలం..
X

దిశ, జూబ్లిహిల్స్ : జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో నార్కోటిక్ బ్యూరో , జూబ్లీహిల్స్ పోలీసులు కలిసి ఆపరేషన్‌లో భాగంగా దాడులు నిర్వహించి, డ్రగ్స్ సేవిస్తున్న పలువురు వ్యక్తులను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్ళితే ఆదివారం రాత్రి "వైట్ అండ్ వైట్" కార్యక్రమంలో జోరా పబ్‌లో దాడి జరిగింది. ఈ ఘటనలో పలువురు డ్రగ్స్ వాడుతున్నట్లు నార్కోటిక్ బ్యూరోకు సమాచారం అందడంతో జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి హాజరైన వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, కొందరికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా తేలిన వారిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన వారి పేర్లను ఇంకా వెల్లడించలేదు. నగరంలో మాదకద్రవ్యాల వినియోగం, వ్యాపారాన్ని అరికట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ ఆపరేషన్‌ పోలీసులు చేపట్టారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకునేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed