మాజీ మంత్రి తలసాని ఆఫీసులో ఫైల్స్ మాయం.. డీసీపీ రియాక్షన్‌ ఇదే!

by GSrikanth |
మాజీ మంత్రి తలసాని ఆఫీసులో ఫైల్స్ మాయం.. డీసీపీ రియాక్షన్‌ ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా వ్యవహరించిన పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయమైనట్లు వస్తున్న వార్తలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఆఫీస్ కిటికీ గ్రిల్స్‌ తొలగించి దుండగులు ఫైల్స్‌ ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫైల్స్‌ మాయం అయినట్లు గుర్తించిన అధికారులు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా.. ఈ కేసుపై డీసీపీ శ్రీనివాస్ స్పందించారు. ఈ సందర్భంగా డెరైరెక్టర్‌ను ప్రశ్నించారు. ఫైల్స్‌ అదృశ్యంపై డైరెక్టర్ సమాచారం లేదనడంతో కేసు నమోదు చేశారు. అనంతరం సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. కాగా, ఓఎస్డీ కల్యాణ్‌, ఆపరేటర్‌ మోహన్‌ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్‌లపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story