పగలు పాత సామాను సేకరణ...రాత్రి ఇళ్లలో చోరీ

by Sridhar Babu |
పగలు పాత సామాను సేకరణ...రాత్రి ఇళ్లలో చోరీ
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : దొంగతనం చేసిన బంగారు ఆభరణాలను అమ్ముకోవాలని యత్నిస్తున్న దొంగలను మాటువేసి 2వ పట్టణ పోలీసులు పట్టుకున్నారు. 2వ పట్టణ సీఐ ఇజాజ్ అహ్మద్ కథనం మేరకు పట్టణ సమీపంలోని బోయపల్లికి చెందిన మండ్ల మాసయ్య(అలియాస్ మొండి చిన్న) ఆదివారం స్థానిక మోతీనగర్ లో పాత ఇనుప సామాన్లు ఏరుకోవడానికి వెళ్లి అక్కడ తాళం వేసిన ఇంటిపై కన్నేశాడు.

అదే రాత్రి వచ్చి తాళం విరగ్గొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను పగులగొట్టి బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులను దోచుకొని వెళ్లిపోయాడు. బుధవారం మాసయ్య స్నేహితురాలు మండ్ల లక్ష్మీ అలియాస్ జ్యోతితో కలిసి దొంగిలించిన ఆభరణాలను అమ్ముకోవడానికి స్థానిక న్యూ టౌన్ చౌరస్తాలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన 2 టౌన్ పోలీసులు పట్టుకొని విచారించారు. అనంతరం 123 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed