- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Student conflict : కళాశాలలో విద్యార్థులకు రక్షణ ఏది..
దిశ, బేగంపేట : సికింద్రాబాద్ బ్రాంచ్ అవినాష్ కాలేజ్ యాజమాన్యం గురువారం సాయంత్రం బాలంరాయ్ క్లాసిక్ గార్డెన్స్ లో విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ తరుణంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చదువుతున్న కొంతమంది విద్యార్థులు, కాలేజ్ కు సంబంధం లేని బయట నుండి కొంతమంది పోకిరీలను తీసుకువచ్చి అవినాష్ కాలేజ్ ద్వితీయ సంవత్సరంలో చదువుతున్న, నితిన్, ముఖేష్, పీయూష్ అనే విద్యార్థులను మారనాయుధాలతో తీవ్రంగా దాడి చేశారు. ఈ సంఘటలో తృతిలో తమ పిల్లలు ప్రాణాల నుంచి బయటపడ్డారని గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.
లక్షల రూపాయల ఫీజులు చెల్లించి తమ పిల్లలను అవినాష్ కాలేజీలో చదివించినందుకు వాళ్లకు కాలేజ్ యాజమాన్యం ఇచ్చే బహుమతి ఇదేనా అని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. కాలేజీలో విద్య బోధించే ఉపాధ్యాయులు ఉండాలే కానీ బౌన్సర్లు ఎందుకని యాజమాన్యాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యం పై ఆగ్రహిస్తున్నారు. తమ పిల్లల పై దాడికి దిగిన పోకిరీలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇంత జరగడానికి కారణం అయిన కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యపు వైఖరిని విద్యార్థులు తల్లిదండ్రులు తప్పు పడుతున్నారు. ఈ విషయం పై బాధితుని కుటుంబ సభ్యులు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.