BREAKING: చెన్నైలోని పుదుకోట్టైలో పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో నష్టం

by Shiva |
BREAKING: చెన్నైలోని పుదుకోట్టైలో పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.కోట్లలో నష్టం
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నైలోని పుదుకోట్టైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ముందుగా పట్టణంలోని ఓ జ్యువెలరీ షాపులో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి పూట ప్రమాదం జరగడంతో ఆ మంటలు కాస్త పక్కనే ఉన్న బాణాసంచా షాపునకు అంటుకున్నాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున పేళ్లుల్లు సంభించించాయి. దీంతో ఆ పేలుడు ధాటికి భవనం కూడా పాక్షికంగా ధ్వంసమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థాలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ ప్రమాదంలో రూ.కోట్లల్లో నష్టం వాటిల్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

Advertisement

Next Story