BREAKING: నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో నిందితుడు

by Shiva |
BREAKING: నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. పోలీసుల అదుపులో నిందితుడు
X

దిశ, వెబ్‌డెస్క్: నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టైన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. రసాయనాలతో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారనే పక్కా సమాచారం అందుకున్న ఈస్ట్‌ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తయారీ కేంద్రంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడుల్లో 1,300 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ను వారు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ప్రమాదకరమైన రసాయనాలను కూడా సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Advertisement

Next Story