వైన్స్ వద్ద ఘర్షణ

by Sridhar Babu |
వైన్స్ వద్ద ఘర్షణ
X

దిశ, అడ్డాకుల (మూసాపేట) : మూసాపేట మండల కేంద్రంలోని కార్తీక్ వైన్స్ సిబ్బంది, కస్టమర్లకు మధ్య ఘర్షణ జరిగింది. ఇందుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంకలమద్ది గ్రామానికి చెందిన శేఖర్, జనార్ధన్, మరో ఇద్దరు కలిసి కార్తీక్ వైన్స్ వద్దకు చేరుకొని అక్కడ బీర్లు కొనుగోలు చేసి చికెన్ ఆర్డర్ చేసి డబ్బులు చెల్లించారు. స్టఫ్ తీసుకొని సిట్టింగ్ గదిలో కూర్చొని బీర్లు తాగారు. బీర్లు అయిపోయే వరకు ఆర్డర్ చేసిన చికెన్ రాకపోవడంతో పలుమార్లు కస్టమర్లు పిలిచారు. ఎంతకూ రాకపోవడంతో అక్కడే ఖాళీగా ఉన్న బీరు సీసాను డబ్బా కేసి కొట్టారు.

దీంతో ఆగ్రహించిన యాజమాన్యం, సిబ్బంది నలుగురు వ్యక్తులపై దాడికి తెగబడ్డారు. అక్కడ ఉన్నవారు ఎంత నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో.. 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చెక్కదిద్ది ఇరువర్గాలను పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఓ వైన్ షాపు వద్ద జరిగిన ఇటువంటి సంఘటనలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయినప్పటికీ వైన్స్ యాజమాన్యాలు, సిబ్బంది దాడులకు పాల్పడడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed